సిద్దార్థుడు అనే రాకుమారుడు ఇల్లు విడిచి తపస్సుకోసం బయలు దేరాడు. బుద్దుడుగా మారాడు. బ్రాహ్మణీయ సమాజం చేస్తున్న యాగాలు యఙ్ఞాలను నిరసించి. అహింసా యుతమైన మార్గాన్ని బోధించాడు. ఇది మనకు తెలిసిన కథ. అయితే సిద్దార్థుడు ఇల్లువదిలేనాటికి ఇంట్లో నిద్రపోతున్న ఆయన భార్య యశోధర ఏమైంది? ఆమె ఆ తర్వాత ఎలా జీవించింది? ఈ ప్రశ్నలకి సమాధానమే ఈ రచన. బుద్దుని అడుగులు ఙ్ఞానాన్వేషణ వైపు పడటానికి యశోధర సహాకరం కూడా ఉన్నది....