ఎవరైనా ఎందుకు ప్రాణాలకు హామీ లేని ఉద్యమాల్ని కావాలని కావిలించుకుంటారు? ఎందుకని తమ పరిసరాల మీద తెగించి తిరుగబడతారు? చివరికి, ఎందుకని తిరుగుబాట్ల మీద కూడా తిరుగబడతారు? అలాంటి మనుషులు ఎలా 'తయారవుతా'రు? వాళ్లు అలా అవడానికి, పార్టీల్లోనయినా బయటయినా 'రెబెల్స్' గా ఉంటానికి భౌతిక, మానసిక కారణాల అన్వేషణ ఈ నవల. పవన్ కుమార్ అనే ఒక సామాన్యుని కథ ఇది. బతుకు పయనంలో భాగంగా, ఉద్యమంలోనికి బయటికి అతడి 'ట్రావెలోగ్' ...