తన పేరు లలిత కుమారి అయినా, ఆమె మనకి ఓల్గా గా నే పరిచయం. వోల్గా అనే కలం పేరుతో ఆమె చేసిన అద్భుతమైన రచనలకు ఎన్నో రివార్డులు అవార్డులు వచ్చాయి.స్త్రీ వాద రచయిత్రి గా ఓల్గా పేరు తెచ్చుకుని స్త్రీ పాత్రలకి పెద్ద పీట వేస్తూ ఎన్నో రచనలను చేశారు. అయితే ఓల్గా 'కథలు లేని కాలం' అనే పేరుతో పాఠకుల ముందుకు తీసుకొని వచ్చిన కథలకి ఎంతో ఆదరణ లభించింది. ఇకపోతే ఈ కథలు లేని కాలం లో ఆమె మానవ సంబంధాలని గూర్చి అనేక కథలని...