గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో , ఎప్పుడు ఎక్కడ బయలుదేరామో..బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో.. ఏ గొప్పలు చూశామో, ఏ తప్పులు చేశామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరైన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్దం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావలసిన భారత చరిత్ర విదేశీయుల చేతుల్లో అష్తావక్రంగా ఎలా తయారైందో..మహాక్రూరులను మహాపురుషులుగా, జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చి...