"నా ఈ శరీరం నాది కాదా? దీని మీద అధికారం నాది కాదా? దీని మీద హక్కు నాకు లేదా అని నా ఆత్మా అరిచే అరుపులను విననట్లు, అవి వినపడనట్లు కూచోటం నా చేత కావటం లేదు. నేనెక్కడ పరాయిదాన్ని కానో, ఎక్కడ నాకూ, నా ఆలోచనలకూ గౌరవం దొరుకుతుందో ఆ చోటుని వెదుక్కుంటూ వెళ్ళాలి. ఆ చోటు ఎక్కడా లేదని వీళ్ళు చెప్పే మాటలు నేను నమ్మను ఒక వేళ ఇంతవరకూ ఆ చోటు ఎక్కడా లేకపోతే నేను సృష్టిస్తాను. ఆడది కేవలం పిల్లల్ని మాత్రమే సృష్టిస్...