సోవియట్ సమాజం ఎంత అనాకర్షణీయమైన వ్యవస్థ అయినా అది ఉండబట్టే అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా సామ్రాజ్యదాహం కొంత మేరకు అదుపులో ఉండిందని ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతున్నది. అమెరికా, రష్యా కూటముల మధ్య 50 ఏళ్ళపాటు ఉండిన సమతుల్యం అసమతుల్యమే అయినా, అణు యుద్ధం అంచున ఉన్న శాంతే అయినా, చిన్నాచితక దేశాలను పెద్దవారి ప్రయోజనాల కోసం కొట్లాడించిన ప్రచ్ఛన్న యుద్ధమే అయినా ఐక్యరాజ్యసమితి రూపంలో మానవ నాగరికత సాధించినట్...