చెట్టునీడ మోసానికి ఒక్కో సరి వావి వరుసలు అవసరం లేదు. ఎవరు ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తారు. అయితే ప్రతి ఒక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. మోసపోయిన వాళ్ళు బాధ పడక తప్పదు. మనుషులస్వభావాలే చిత్రం గా ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్ధం కాదు. అలాంటిమనుషులందరినీ, వారి స్వభావాలనీ చక్కగా ఈ చెట్టు నీడ కథ లో ఆవిష్కరించారు అరిగే రామారావుగారు.ఆసక్తి గా సాగే కథనం వంశీ గారి హృదయాన్ని ఆర్ద్రం చేసింది, అందుక...