సమాజంలో కేవలం బలప్రయోగంతోనే కులవ్యవస్థ స్థిరీకరించబడ్డదని బలంగా నమ్మి, భారతీయ గతితార్కిక భౌతిక వాదాన్ని కులం వెలుగులో పూర్వపక్షం చేయాల్సిన అవసరాన్ని గుర్తెరిగిన అతి కొద్దిమంది సామాజిక శాస్త్రవేత్తల్లో మొండ్రు ఫ్రాన్సిస్ గోపీనాథ్ ఒకరు. ఆయన మూడో పుస్తకం 'మీరు నాతో ఏకీభవించరా అయితే సంతోషం'ను ఛాయా రిసోర్స్ సెంటర్ ప్రచురించింది. ఏభై ఏళ్ళ నక్షల్బరి, బహుజన సమాజ్ పార్టీ, నిన్నటి భీమా కోరేగావ్ కుట్రకేసు సహ...