"దేవదాసి వ్యవస్థ నేపథ్యంగా వచ్చిన నవల 'మనోధర్మపరాగం'.
120 యేళ్ల సుదీర్ఘ కాలాన్ని కేన్వాసుగా తీసుకుని చరిత్రనూ, కల్పననూ కలగలిపి ఈ రచన చేశారు. ఇందులోని ప్రతి సంఘటనా అంతకు ముందు ఎక్కడో విన్నట్లే, చదివినట్లే అనిపిస్తుంది. అంతకు ముందే ఎం.ఎస్.సుబ్బలక్ష్మి మీద తెలుగులో వచ్చిన పుస్తకాల ప్రభావం కావచ్చు. కళావంతులు అనే పేరు సూర్యబలిజగా మారిపోయినట్లే ఈ నవలలో మధురై, చిత్తూరుగా మారిపోయింది చారిత్రక పాత్రలనే తీస...