అడివి బాపిరాజు రాసిన 'కోనంగి' ఒక సాంఘిక నవల. ఈ నవల అప్పటి కాలమాన పరిస్థితులను మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఆనతి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ, నిజాయితీ నిబద్ధత, హాస్య చతురత కలగలిసిన ఒక ఆలోచింపజేసే రచన ఈ కోనంగి. ఇందులో ఒక యువకుడి జీవితం మనందరికీ కనిపిస్తుంది. అప్పట్లో సమాజం లో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి చెప్తూ, ఒక యువకుడి గమనాన్ని మనకి తన రచన ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసాడు బాపిరాజు. అప్ప...