బ్యాంకు ఉద్యోగాన్ని సైతం మానుకొని రచయత గా మారాలని నిర్ణయించుకున్న అమిష్ త్రిపాఠి ఎక్కువగా మన భారత పురాణేతిహాసాల మీద రచనలు చేశారు. 'ఇక్ష్వాకు కుల తిలకుడు' పేరుతో ఆయన శ్రీరాముని చరిత్ర మీద రాసిన పుస్తకం అత్యంత ఆదరణ పొందింది. రావణుడి పై రాముడు సంధించిన యుద్ధం ఈ పుస్తకం లో మనం కళ్ళకి కట్టినట్టు గా చూడొచ్చు. తన ప్రాంతాన్ని, తన దేశాన్ని, తన ప్రజలని అమితంగా ప్రేమించే సీరాముడు న్యాయం కోసం స్థిరంగా నిలబడతా...