"ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి…
యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనన...