అడవి బాపిరాజు (1895 - 1952) కవి, చిత్రకారుడు, శిల్పి, కథకుడు, నవలా రచయిత, గాయకుడు, పత్రికా సంపాదకుడు, కళాదర్శకుడు, జాతీయోద్యమ యోధుడు, ఆచార్యుడు. కాల్పనికోద్యమకాలంలో బాపిరాజు ఇటు తెలుగు కవిత్వాన్నీ, సృజనాత్మక వచన రచనలనూ కొత్త పుంతలు తొక్కించాడు, అటు ఆంధ్రజాతి ప్రాచీన వైభవాన్ని మహోజ్జ్వలంగా దీపింపజేసి జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించాడు. ఆంధ్రత్వం మూర్తీభవించిన బాపిరాజు చారిత్రకనవలా రచనలో తనదంటూ ప్రత్య...