వంశీ దర్శకత్వ ప్రతిభ మనందరికీ సుపరిచితమే. అలాగే అతని రచనా శైలి కూడా ఎంతో వినూత్నం గా ఉంటుంది. వంశీ రాసే కథలు కానీ ఆయన ఎంపిక చేసి ప్రచురించే కథా సంకలనం కానీ ఎంతో ఆసక్తి గా ఉంటుంది. ఆయన దృష్టిలో ప్రతి పుస్తకం రావటానికి వెనుక ఒక మూలమైన ఆలోచన ఉంటుంది. "ఆనాటి వాన చినుకులు" కి కూడా ఒక ఆలోచన ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక గూడు రిక్షా మీద ఆయన చూసిన 'ఆనాటి వానచినుకులు' అన్న వాక్యం తనని ఆల...